డ్రైవింగ్.. అలర్ట్
పొగ మంచు ఉండే సమయాల్లో డ్రైవర్లు వాహనాల వేగాన్ని తగ్గించుకోవాలి.
● పొగమంచులో దృశ్యమానత తక్కువగా ఉంటున్నందున సరైన లైట్లు ఉపయోగించాలి, లోబీమ్ హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు ఉపయోగించాలి. హైబీమ్ లైట్లు ఉపయోగించరాదు. అవి పొగమంచులో ప్రతిఫలించి దృశ్యమానతను తగ్గిస్తాయి.
● వెనుక వైపు టెయిల్ లైట్లు ఆన్‌లో ఉండేలా చూడాలి.
● వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించాలి.
● రోడ్డు మార్కింగ్‌ను అనుసరించాలి.
● అత్యవసరమైతే తప్ప ఓవర్ టేక్ చేయరాదు.
● అకస్మాత్తు మలుపులు నివారించాలి.
● విండ్ స్క్రీన్ స్పష్టంగా ఉండాలి. డీఫాగర్, వైపర్లు ఉపయోగించి విండ్ స్క్రీన్ స్పష్టంగా ఉండేలా చూడాలి.
● అద్దాలు, కిటికీలు శుభ్రంగా ఉంచాలి.
● పాదచారులు , సైకిల్ నడిపే వారు జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
● ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోతే పార్కింగ్ లైట్లు, హజార్డ్ లైట్లు ఆన్ చేయాలి.
● రోడ్డు మధ్యలో వాహనం ఆపవద్దు. ప్రమాదాలు జరిగే ప్రాంతంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.
– వాణి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, నల్లగొండ


