న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలం శేరిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన తాను ఆర్‌ఓ, పీఓల తప్పిదం వల్లే ఓటమి పాలయ్యాయని ఆరోపిస్తూ రమావత్ సునిత గురువారం నల్లగొండలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తం వార్డుల ఓట్లు 990 పోలవ్వగా సర్పంచ్ ఓట్లు 992 ఓట్లు పోలయ్యాయని, అలాగే ఆర్‌ఓ, పీఓ అవతలి అభ్యర్థికి సానుకూలంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే ఫాం–27పై సంతకాలు తీసుకున్నట్లు తెలిపారు. రిజెక్టెడ్, పోలైన ఓట్ల సీరియల్ నంబర్లతోపాటు ఫాం–26, 27, 28లను పరిశీలించి తగిన న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.


