సమస్యాత్మక కేంద్రాలపై దృష్టిసారించాలి
దేవరకొండ : మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వహించనున్న పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిసారించాలని జోన్–6 డీఐజీ ఎల్‌ఎస్.చౌహాన్ అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లిలో ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై పోలీస్ సిబ్బందితో నిర్వహించిన సమగ్ర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్ పరిధిలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అదనపు పోలీస్ బందోబస్తు, నిరంతర గస్తీ, పర్యవేక్షణ, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచ తప్పకుండా అమలు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉండే అధికారులు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఫ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్


