ఆరోగ్య చట్టాలపై అవగాహన అవసరం
నల్లగొండ టౌన్ : ప్రతి ఒక్కరికీ ఆరోగ్య రక్షణ చట్టాలపై అవగాహన ఎంతో అవసరమని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ భీమార్జున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విశ్వమానవ ఆరోగ్య రక్షణ చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చట్టాలపై అవగాహన ఉంటేనే హక్కులను కాపాడుకోవచ్చన్నారు. ఎవరివల్ల అన్యాయానికి గురికాకుండా ఉంటారని తెలిపారు. దీనికోసమే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్ మాట్లాడుతూ ఆరోగ్య భద్రత ప్రతిఒక్కరి హక్కు అని మన భారత రాజ్యాంగం పీఠికలోనే ఉందన్నారు. అన్నిరకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందించాలన్నారు. ఆయన జిల్లా మాస్ మీడియా అధికారి డాక్టర్ తిరుపతిరావు, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.


