చిన్న మాధారంలో రీకౌంటింగ్ జరపాలి
నల్లగొండ టూటౌన్ : కనగల్ మండలం చిన్నమాదారంలో తొలి విడత పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, రీకౌంటింగ్ జరపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పిండి భాగ్యమ్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం నల్లగొండలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేశారు. గురువారం సాయంత్రమే రీకౌంటింగ్ జరపాలని పోలింగ్ అధికారులను కోరామని, రీకౌంటింగ్ చేస్తామని చేయకుండా రాత్రి 10 గంటల సమయంలో మరో అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని వివరించారు. పోలింగ్ అధికారులు, పోలీసులు తమపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అవకతవకలకు పాల్పడిన అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకొని, రీకౌంటింగ్ జరిపి న్యాయమైన ఫలితాలు వెల్లడించాలని విన్నవించారు. వారి వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు.


