నేడు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష
పెద్దవూర : చలకుర్తి క్యాంపులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి 4,338 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,339 మంది బాలురు, 1939 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు.
ఆన్‌లైన్‌లోనే హాల్‌టికెట్లు
జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు యాదాద్రి జిల్లాలో 492 మంది, సూర్యాపేట జిల్లాలో 1575, నల్లగొండ జిల్లాలో 2,271 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్ష కోసం నల్లగొండ జిల్లాలో 13, భువనగిరి యాదాద్రిలో 4, సూర్యాపేట జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తున్న చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారానే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. పరీక్ష ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరుగుతుందని, విద్యార్థులు ఉదయం 10.30లోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అదనంగా మరో 40 నిమిషాల వరకు అనుమతించనున్నట్లు తెలిపారు.
అందుబాటులో 80 సీట్లు
6వ తరగతిలో 80 సీట్లు ఉన్నాయి. ఇందులో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కెటాయిస్తారు. ఎస్సీలకు 15 శాతం, 7.5 శాతం ఎస్టీలకు, 3 శాతం దివ్యాంగులకు, 27 శాతం ఓబీసీలకు, మొత్తం సీట్లలో 33 శాతం బాలికలకు కేటాయిస్తారు. మెరిట్ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేస్తారు.
విద్యార్థులు వీటితో రావాలి
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు పరీక్ష ప్యాడ్, బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ వెంట తీసుకొని రావాలి.
ఫ ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.
ఫ అడ్మిట్ కార్డులో వివరాలు తప్పుగా పడితే
వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలి.
ఫ విద్యార్థులు ఓఎంఆర్ షీటుతో పాటు ప్రశ్నపత్రంపై హాల్ టికెట్ నంబరు వేయాలి.
ఫ విద్యార్థులు 1.30 గంటకు ముందు హాల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు.
ఫ 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహణ
ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
26 పరీక్ష కేంద్రాలు
ఫ హాజరు కానున్న
4,338 మంది విద్యార్థులు
ఫ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ


