కంగ్రాట్స్ డాడీ..
ఫ తండ్రికి శుభాకాంక్షలు తెలిపిన
మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
నాగారం : సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన గుంటకండ్ల రామచంద్రారెడ్డికి తన కుమారుడైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శుక్రవారం నాగారంలోని తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. జగదీష్‌రెడ్డి తన తండ్రి రామచంద్రారెడ్డికి పుష్పగుచ్చాలు అందించి, శాలువాతో సన్మానించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో పాటు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు రామచంద్రారెడ్డిని సన్మానించారు.
మద్యం, డబ్బులు ఇస్తే ఓటు వేయం
భూదాన్‌పోచంపల్లి : గ్రామ పంచాయతీ ఎన్ని కల్లో ఎవరైనా తమకు మద్యం, డబ్బులు ఇచ్చేందుకు యత్నిస్తే వారికి ఓటు వేయమంటూ భూదాన్‌పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన బిజిలి యోగేశ్ చెబుతున్నాడు. ఇదే విషయాన్ని పోస్టర్ రూపంలో తన ఇంటి ప్రహరీకి అతికించాడు. ఓటర్లను ప్రలోభ పెట్టి బలవంతంగా డబ్బులు, మందు ఇచ్చే వారికి ఎప్పటికీ ఓటు వెయ్యమంటూ కరపత్రాల ద్వారా హెచ్చరించాడు. గ్రామ సర్పంచ్‌ను నిజాయితీగా ఎన్నుకోవాలనే యోగేశ్ ఆలోచనను స్థానికులు అభినందిస్తున్నారు.
రేగట్టెలో ‘భారత’
ఫ్యామిలీ హవా
కనగల్ : మండలంలోని రేగట్టే గ్రామంలో భారత ఫ్యామిలీకి చెందిన వారు ఏకంగా మూడు సార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2001లో రేగట్టే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా భారత వెంకటేశం పోటీ చేసి గెలుపొందారు. 2006లో వెంకటేశం భార్య కవిత టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2011లో భారత వెంకటేశం ఎంపీటీసీగా గెలుపొంది వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యాడు. గురువారం జరిగిన ఎన్నికల్లో వెంకటేశం భార్య కవిత రేగట్టె పంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
కంగ్రాట్స్ డాడీ..


