
నాగార్జునసాగర్‌కు స్వల్పంగా తగ్గిన వరద
నాగార్జునసాగర్: సాగర్‌కు వచ్చే వరద తగ్గుముఖం పడుతోంది. నాగార్జునసాగర్ జలాశయానికి 2,90,239 క్యూసెక్కులు వస్తుండగా 2,50,169 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 585.10 అడుగులు (297.7235 టీఎంసీలు) ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లను నెమ్మదిగా కిందికి దింపుతున్నారు. ప్రస్తుతం 26గేట్లు ఐదు అడుగులెత్తి స్పిల్‌వే మీదుగా 1,96,742 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,739 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.