
ఐడబ్ల్యూఎల్‌ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వేనేపల్ల
కోదాడ: కోదాడకు చెందిన వేనేపల్లి శృతి ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్ల్యూఎల్‌ఎఫ్) జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. సోమవారం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆమెను జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమించినట్లు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు సహదేవన్ ప్రకటించారు. ప్రస్తు తం శృతి ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ తెలంగాణ శాఖ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
ఎయిమ్స్‌లో ఉద్యోగాల పేరిట మోసాలు
● అప్రమత్తంగా ఉండాలని సూచించిన డిప్యూటీ డైరెక్టర్
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ బిపిన్ వర్గీస్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎయిమ్స్ పేరిట నకిలీ ఈమెయిల్ ఐడీలు, వెబ్‌సైట్‌లు సృష్టిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బుల కోసం అక్రమార్కులు మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎయిమ్స్‌లో రెగ్యులర్, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పారదర్శకంగా నియామకాలు జరుగుతాయని.. ఏజెన్సీలు, వ్యక్తుల ద్వారా నియామకాలు జరగవని సూచించారు. మోసాలకు పాల్పడే వ్యక్తులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.

ఐడబ్ల్యూఎల్‌ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వేనేపల్ల