ఇంటి నిర్మాణానికి రుణం! | - | Sakshi
Sakshi News home page

ఇంటి నిర్మాణానికి రుణం!

Aug 18 2025 5:49 AM | Updated on Aug 18 2025 5:49 AM

ఇంటి

ఇంటి నిర్మాణానికి రుణం!

నెలకు రూ.4 వేలు

తిరిగి చెల్లించాలి..

నల్లగొండ : ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే స్థోమత లేని పేదలకు ప్రభుత్వం రుణసాయం చేస్తోంది. ప్రభుత్వం ప్లాటు ఉండి ఇల్లులేని వారికి మొదటి విడతగా 19,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఇంటి నిర్మాణం ప్రారంభించి బేస్‌మెంట్‌ లెవెల్‌ వరకు పూర్తి చేస్తేనే మొదటి విడత బిల్లు మంజూరవుతుంది. అందుకు బునాది తీయడం, రాతి కట్టడంతో పాటు సిమెంట్‌, సీకులు, ఇసుక , కూలీలకు, మేసీ్త్రలకు డబ్బులు అవసరం అవుతాయి. ఆ డబ్బులు లేని కొందరు పేదలు ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదు. దీంతో జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఇల్లు నిర్మించుకునే స్థోమత లేనివారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇప్పటికే జిల్లాలో 241 మందికి రూ.లక్ష రుణం అందజేశారు.

సంఘాల్లో సభ్యులు కాకపోయినా..

జిల్లాలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేందుకు పేదలైన లబ్ధిదారులకు.. ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాల ద్వారా సీ్త్రనిధి, బ్యాంకుల ద్వారా రూ.లక్ష రుణం మంజూరు చేస్తున్నారు. జిల్లాలో 241 మందికి రూ.2.44 కోట్ల రుణం అందించారు. కొందరు మహిళా సంఘాల్లో సభ్యులు కాకపోయినా.. వారిని సభ్యులుగా చేర్చి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో సంబంధిత డీఆర్‌డీఓ సిబ్బంది లబ్ధిదారులను గుర్తించి రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.

మహిళా సంఘాల ద్వారా రుణాలు పొందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నెలకు రూ.4 వేల చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే క్రమంలో ప్రభుత్వం విడతల వారీగా ఇచ్చే డబ్బులను మంజూరు చేయగానే తిరిగి మహిళా సంఘాల ద్వారా తీసుకున్న అప్పును చెల్లించే అవకాశం కూడా ఉంది.

ఫ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు ప్రభుత్వం భరోసా

ఫ మహిళా సంఘాల సభ్యులకు

సీ్త్ర నిధి, బ్యాంకుల ద్వారా రుణాలు

ఫ జిల్లాలో ఇప్పటికే 241 మందికి రూ.లక్ష చొప్పున రుణం అందజేత

ఇంటి నిర్మాణానికి రుణం!1
1/1

ఇంటి నిర్మాణానికి రుణం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement