
ఖాళీల భర్తీకి తాత్సారం
నల్లగొండ : అసిస్టెంట్ లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్ల నియామకంలో విద్యుత్ శాఖ తాత్సారం చేస్తోంది. క్షేతస్థ్రాయిలో పనిచేసే సిబ్బంది కొరత కారణంగా ఉన్నవారికే అదనపు బాధ్యతలు అప్పగిస్తోంద. దీంతో విధి నిర్వహణలో సిబ్బంది ఇబ్బందులు పడడంతోపాటు.. వినియోగదారులకు సేవలు అందడంలో తాత్సారం జరుగుతోంది. 2023లో జూనియర్ లైన్‌మెన్ల నియామకం చేపట్టానా.. వారిని క్షేత్రస్థాయిలో వినయోగించుకోకుండా.. సగం మందిని సబ్‌స్టేషన్లకే పరిమితం చేసింది. దీంతో ఫీల్డ్‌లో పని చేసేవారు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఒక్కో లైన్‌మన్‌కు 3 వేల కనెక్షన్లు
క్షేత్రస్థాయిలో పనిచేసే ఒక్కో జూనియర్ లైన్‌మన్ పరిధిలో 3 వేలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి. వారికి సహాయంగా అసిస్టెంట్ లైన్‌మన్ ఉంటారు. విద్యుత్ సరఫరాతో పాటు విద్యుత్ అంతరాయాలు నివారించడం, మీటర్ రీడింగ్, బిల్లుల వసూలు చేయాల్సిన బాధ్యత వారిదే. ఈ పనులన్నీ వారే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్రాంతాలను వారికి అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
2023లో జేఎల్‌ఎం పోస్టుల భర్తీ
క్షేత్రస్థాయిలో పని చేసేందుకు 2023లో జూనియర్ లైన్‌మెన్లను నియమించారు. వారంతా క్షేత్రస్థాయిలో పని చేయాల్సి ఉన్నా.. సగం మందిని సబ్‌స్టేషన్లలో విధులకు నియమించారు. అప్పుడు 136 పోస్టులను భర్తీ చేస్తే అందులో 68 మంది సబ్‌స్టేషన్‌లో నియమించగా.. 68 మంది మాత్రమే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు.
సబ్ స్టేషన్లలో
96 మంది రిటైర్డ్ ఉద్యోగులే..
సబ్ స్టేషన్లలో ప్రస్తుతం 96 మంది రిటైర్డ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వాస్తవంగా రిటైర్డ్ అయిన ఉద్యోగుల్లో కొందరు మాత్రమే ప్రత్యక్షంగా విధులు నిర్వహిస్తున్నారు. మరికొందరు వారి బదులు మరొకరిని పెట్టుకుని పని చేయిస్తున్నారు. వారిస్థానంలో కొత్త వారిని నియమిస్తే నిరుద్యోగులకు మేలు కలుగుతుంది.
ఖాళీల వివరాలు ఇలా..
ఉద్యోగం మొత్తం పని ఖాళీలు
పోస్టులు చేస్తుంది
అసిస్టెంట్ లైన్‌మెన్ 194 144 50
జూనియర్ లైన్‌మెన్ 272 150 122
ఫ విద్యుత్ శాఖలో భారీగా జేఎల్‌ఎం, అసిస్టెంట్ లైన్‌మెన్ ఖాళీలు
ఫ సిబ్బంది లేక క్షేత్రస్థాయిలో అందని సేవలు