
అమ్మ పాలే ఆరోగ్యం
పూర్తి స్థాయిలో
అవగాహన కల్పిస్తాం
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు అంశాలపై పూర్తి స్థాయిలో వివరిస్తాం. ఇందుకోసం అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన పరుస్తారు. కాన్పుకు దగ్గరలో ఉన్న గర్భిణులకు తల్లిపాల పాముఖ్యతను తెలియజేస్తాం.
– కృష్ణవేణి, జిల్లా మహిళా,
శిశు సంక్షేమ శాఖ అధికారి
మిర్యాలగూడ టౌన్ : తల్లిపాలు అమృతంతో సమానం. శిశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు తాపించడం తప్పనిసరి. తద్వారా తల్లిబిడ్డలకు ఎంతో శ్రేయస్కరం. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఈనెల 7వ తేదీ వరకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఇంటింటికి అంగన్‌వాడీ పేరుతో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించేందుకు ఐసీడీఎస్ యంత్రాంగం సిద్ధమైంది. గ్రామాలు, పట్టణాల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి తల్లి పాల ప్రాముఖ్యతతోపాటు పిల్లలకు ఇవ్వాల్సిన అనుబంధ ఆహారంపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తారు.
ముర్రుపాలు ఎంతో మేలు..
బిడ్డ పుట్టిన మొదటి గంటలోపే తల్లి ముర్రుపాలు కచ్చితంగా శిశువుకు తాపించాలి. ఈ పాలలో మాంసకృత్తులు పోటీన్లు, ఏ,సీ,డీ,ఈ,కే మిటమిన్లు, కొవ్వు, చక్కర పదార్థాలు, మినరల్స్ బిడ్డకు అందుతాయి. ఇవన్నీ బిడ్డలో రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ఆరు మాసాల తర్వాత బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా తల్లిపాలు పట్టాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. దీంతో తల్లులు రోమ్ము క్యాన్సర్‌కు గురికారు. తల్లిపాలలో ఇనుము, కాల్షియం ఉండడంతో బిడ్డలో రక్తహీనత ఏర్పడదు. తల్లిపాలు సులభంగా జీర్ణం అవుతాయి. శిశువుకు మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తవు. పాలు పుష్కలంగా రావాలంటే గర్భం దాల్చినప్పటి నుంచే పోషక విలువలు ఉన్న ఆహారం పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు తగిన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు
ఫ ఇంటింటికి అంగన్‌వాడీ సిబ్బంది
ఫ తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన
ఫ 7వ తేదీ వరకు కార్యక్రమం
ఐసీడీఎస్ ప్రాజెక్టులు 09
అంగన్‌వాడీకేంద్రాలు 2,093
7 నెలల నుంచి
ఆరేళ్లలోపు పిల్లలు 71,397
గర్భిణులు 8,538
బాలింతలు 6,595

అమ్మ పాలే ఆరోగ్యం