
‘యంగ్ ఇండియా’ మోడల్‌గా నిలవాలి
ఫ 4న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భూమి పూజకు ఏర్పాట్లు చేయండి
ఫ రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెం వద్ద రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం రాష్ట్రానికే మోడల్‌గా నిలవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నమూనా, నిర్మాణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణాలకు 4వ తేదీన భూమి పూజకు ఏర్పాట్లు చేయాలన్నారు. టీజీఈడబ్ల్యూఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి, కలెక్టర్లకు వివరించారు. భవన నిర్మాణాల్లో మార్పులుంటే నా దృష్టికి తేవాలని కలెక్టర్‌కు సూచించారు. బోధనేతర సిబ్బందికి ముందుగా వసతి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సమీక్షలో అదనపు ఇన్‌చార్జి కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, టీజీఈడబ్ల్యూఐసీడీ డిప్యూటీ ఇంజనీర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యనందిస్తాం
నల్లగొండ టౌన్: నర్సింగ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి భూమిపూజ చేసి మాట్లాడారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నర్సింగ్ కోర్సులు చేయడం ద్వారా భవిష్యత్తులో మెడికల్ టూరిజంలో అనేక ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నా. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రశాంతి పాల్గొన్నారు.