
హామీలు అమలు చేయాల్సిందే
మిర్యాలగూడ టౌన్ : ఎన్నికల సమయంలో చేయూత పింఛనుదారులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు వరకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం మిర్యాగూడలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పింఛన్‌దారుల జిల్లా సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. తీవ్ర అంగవైకల్యం కలిగిన కండరాల క్షిణిత వ్యాధి గ్రహాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 వేల ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రూ.15 వేలు ఇస్తుంటే తెలంగాణలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మేరకు పింఛన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈనెల 13వ తేదీన హైదరాబాద్‌లో దివ్యాంగుల మహాగర్జనకు సంబంధించిన సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ఉద్యమం ఆగదన్నారు. వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకన్నయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సమన్వయకర్త జానకిరామయ్య చౌదరి, రాష్ట్ర నేత అహ్మద్‌ఖాన్, అందె రాంబాబు, గడ్డం ఖాసీం, వెంకటాచారి, సైదులు, రాజేష్, చైతన్యరెడ్డి, ఇంద్రచౌదరి, శ్రీనివాస్, రామేశ్వరీ, లక్ష్మి, సువర్ణ, శంకర్, మధన్‌నాయక్, నాగరాజు, సైదులు, నర్సింహ, వెంకన్న పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ