
స్పీడ్ గన్ చూస్తోంది..
చౌటుప్పల్ రూరల్: వాహనాలను అతివేగంతో నడపడం వల్ల చోదకులు ప్రమాదాలకు గురవడమే కాకుండా ఎదుటివారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు.ఈ నేపథ్యంలో వాహనాల వేగ నియంత్రణపై పోలీసులు దృష్టి సారించారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం పరిధిలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై చెట్లమాటున స్పీడ్‌గన్‌లు ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని రికార్డ్ చేశారు. పరిమితికి మించిన వేగంతో వెళ్తే వెంటనే వాహనదారుడి సెల్‌ఫోన్ లేదా, వాహనం నంబర్ ఆధారంగా ఎంత జరిమానా చెల్లించాలనే సమాచారం వస్తుంది. గంటకు 90 కి.మీ వేగం మించితే చలానా వస్తుందని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ విజయ్‌మోహన్ తెలిపారు.