
106 మంది బాల కార్మికులకు విముక్తి
నల్లగొండ : జూలై నెలలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 106 మంది బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ శాఖతోపాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్ శాఖల అధికారుల సమన్వయంతో బృందాలుగా ఏర్పడి 106 మందికి విముక్తి కల్పించినట్లు వెల్లడించారు. వీరిలో 94 మంది బాలలు, 12 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్, చత్తీస్‌గడ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. బాల కార్మికుల చేత ఎవరైనా పనులు చేయించుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికై నా బాల కార్మికుల సమాచారం తెలిస్తే డయల్– 100, 1098 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.