కొత్త దుకాణాలు లేనట్టే..! | - | Sakshi
Sakshi News home page

కొత్త దుకాణాలు లేనట్టే..!

Aug 1 2025 12:23 PM | Updated on Aug 1 2025 12:23 PM

కొత్త దుకాణాలు లేనట్టే..!

కొత్త దుకాణాలు లేనట్టే..!

టెండర్‌ డిపాజిట్‌ ధర పెంపు ?

గతంలో టెండర్‌లో పాల్గొనాలంటే దరఖాస్తుకు రూ.2 లక్షలు డీడీ చెల్లించాలనే నిబంధన ఉంది. ఈ డబ్బు తిరిగి రాదు ప్రభుత్వానికే చెందుతుంది. అయితే ఈసారి దరఖాస్తుల ధరను మరింతగా పెంచి ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చుకునే పనిలో పడింది. దరఖాస్తు ఫారం ధరను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారుల ద్వారా తెలిసింది.

జనాభా లెక్కలు తేలితేనే అదనపు మద్యం షాపులు

2023లో ఉన్నవాటికే టెండర్లు

పిలువనున్న ఎకై ్సజ్‌ శాఖ

ఈ సారి కూడా ఆగస్టులోనే

షెడ్యూల్‌ జారీకి అవకాశం

దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే యోచన

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈసారి అదనపు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకు ఉన్న పాత దుకాణాలకు మాత్రమే త్వరలో టెండర్లు కోసం షెడ్యూల్‌ జారీ చేసేందుకు ఎకై ్సజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. సాధారణంగా ఉన్న దుకాణాల కంటే అదనంగా పెంచాలంటే కొత్త జనాభా లెక్కలు రావాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సగటున ప్రతి 5వేల మందికి ఒక మద్యం దుకాణం చొప్పున అధికారులు గతంలోనే పెంచారు. వాటి ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 155 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా షాపులకు అనుమతి ఇవ్వకుండా ఉన్న దుకాణాలకే టెండర్లు పిలువనున్నారు.

క్లస్టర్‌ పరిధిలో షాపుల మార్పు..

నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నాయి. ఒక్క వార్డుకు రెండు నుంచి మూడు లెక్కన కేటాయించారు. ఆయా క్లస్టర్ల పరిధిలో ఉన్న షాపులు ఏవైనా సక్రమంగా నడడవం లేదని, దరఖాస్తు చేసుకుంటే ఆ క్లస్టర్‌ పరిధిలోనే ఒకే స్లాబ్‌ విధానం ఉన్న ప్రాంతానికి మద్యం షాపును మార్చుకునేందుకు అనుమతి ఇస్తారు. సాధారణంగా జిల్లాలో క్లస్టర్‌ జనాభా స్లాబ్‌ను బట్టి షాపుల లైసెన్స్‌ ఫీజులను ఫీజులను ఖరారు చేశారు. 5 వేల జనాభా ఉంటే రూ.50 లక్షలు లైసెన్సు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 5 నుంచి 10 వేల జనాభా ఉన్న చోట రూ.55 లక్షలు, 10నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.60 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉంటే రూ.65 లక్షలు, లక్షకు జనాభా ఆపైన ఉంటే రూ.కోటి లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా స్లాబ్‌ల విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 155 మద్యం షాపులు ఉండగా అందులో 95షాపులు మాత్రమే పది రెట్ల రెవెన్యూ దాటాయి. మిగిలినవి ఏడెనిమిది రెట్లు మాత్రమే అమ్మకాల లక్ష్యాన్ని దాటాయి. ఇంకా నాలుగు నెలలు గడువు ఉంది కాబట్టి అన్ని షాపులు పది రెట్ల అమ్మకాలను దాటే అవకావం ఉందని ఽఅధికారులు చెబుతున్నారు. ఏదైనా ఒక షాపులో ఆ మేరకు అమ్మకాలు జరక్కపోతే ఆ క్టస్టర్‌ పరిధిలో, అదే స్లాబ్‌ విధానం ఉన్న ప్రాంతానికి మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

2023లో దరఖాస్తులు 7,057

రెండేళ్ల కిందట జిల్లాలోని 155 మద్యం షాపులకు టెండర్లు పిలువగా 7,057 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని షాపులకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. కనగల్‌ మండలం దర్వేశిపురం మద్యం దుకాణానికి 187 మంది పోటీ పడి దరఖాస్తు చేశారు. రాష్ట్రంలోనే ఈ దుకాణానికే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. పోటీపడిన వారిలో కొందరు ఐదారు దరఖాస్తు చేయగా, సింగిల్‌ టెండర్‌ వేసిన వ్యక్తికే డ్రాలో దక్కింది.

ఈ సారి పెరగనున్న దరఖాస్తులు

ఈసారి కూడా మద్యం షాపులకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. గతంలో చాలా మంది టీంలుగా ఏర్పడి 10 నుంచి 20 షాపులకు టెండర్లు వేశారు. షాపులు వచ్చిన వారినుంచి రానివారు చాలా మంది కొన్నారు. దాంతో ఈసారి కూడా టెండర్లలో పాల్గొనేందుకు చాలామంది సిద్ధమవుతన్నారు.

త్వరలో మద్యం షాపుల టెండర్ల షెడ్యూల్‌

జిల్లాలో త్వరలోనే మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. 2023లో ఆగస్టు 21న టెండర్లు పిలిచి డ్రా తీశారు. డిసెంబర్‌ 1 నుంచి కొత్త షాపుల తెరిచారు. ప్రస్తుతం జిల్లాలోని 155 మద్యం షాపుల లైసెన్స్‌ గడవు నవంబర్‌ 30వ తేదీతో ముగియనుంది. దీంతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి పూర్తిచేయాల్సి ఉంది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆగస్టు నెలలోనే మొదలైతే అందుకు కనీసంగా మూడు నెలల సమయం పట్టనుంది. ఆ సమయంలో దుకాణాల టెండర్లు నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకే గతంలో మాదిరిగానే టెండర్ల ప్రక్రియను ముందుగానే నిర్వహించాలని ఎకై ్సజ్‌ శాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement