
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో జిల్లా విద్యార్థులు రాణించాలని తెలంగాణ యోగా సభ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట సింహాద్రి, ప్రధాన కార్యదర్శి రాయనబోయిన శ్రీను అన్నారు. తెలంగాణ యోగా సభ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలో జిల్లాస్థాయి యోగాసన ఎంపిక పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్ విభాగంలో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై నవారు ఈ నెల 7, 8 తేదీల్లో ఆదిలాబాద్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి యోగా చాంపియన్ షిప్‌లో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనం నాగిరెడ్డి, నామిరెడ్డి సుష్మ, మంగ, మహేశ్వరీ, సునీత, శ్రీనివాసులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి

రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి