
కేసుల దర్యాప్తునకు సాంకేతికత దోహదం
నల్లగొండ: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా కేసుల దర్యాప్తులో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. గురువారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో క్లూస్ టీమ్‌కు కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరం జరిగిన ప్రదేశానికి క్లూస్ టీం త్వరగా చేరుకొని నేర నమూనాలను సేకరించుటకు నూతన సాంకేతిక టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. వివిధ సాంకేతిక పరికరాల సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్ ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్, ఆర్‌ఐలు సూరప్ప నాయుడు, సంతోష్, నరసింహ, క్లూస్ టీమ్ ఇన్‌చార్జి ఎస్‌ఐ శివ సిబ్బంది పాల్గొన్నారు.