ప్రశాంతంగా పాలిసెట్
రామగిరి(నల్లగొండ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి మంగళవారం నిర్వహించిన పాలిసెట్–2025 ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ పట్టణంలో 11 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరిగింది. మొత్తం 5,203 మంది విద్యార్థులకు గాను 2,472 మంది బాలురు, 2,278 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. 453 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కోఆర్డినేటర్, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ సిహెచ్.నర్సింహారావు తెలిపారు.


