నా కుటుంబాన్ని ఆదుకోండి..
ఆరు మాసాల క్రితం బాలు భార్య కిడ్నీ వ్యాధితో చనిపోయింది. ఆమెకు చికిత్స కోసం అప్పు తెచ్చి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాడు. సీఎం రిలీఫ్ పండ్ కింద దరఖాస్తు చేసుకుంటే రూ.60 వేలు వచ్చాయి. నాది పేద కుటుంబమని.. నాకు ముగ్గురు ఆడ పిల్లలు, ఒక బాబు. అందరూ చదువుతున్నారని.. కుటుంబం గడవడం కూడా ఇబ్బందికరంగా ఉందని.. వైద్య ఖర్చులకు అయిన డబ్బులు ఇప్పించాలని కోరాడు. – బాలు, దేవరకొండ
ఇళ్లు ఉన్న వారికే
ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు..
గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తప్పుల తడకగా చేశారని.. అర్హులకు గాకుండా ఇప్పటికే ఇళ్లు ఉన్న వారికే ఇళ్లు మంజూరని తిరుమలగిరిసాగర్ మండలం చిల్లాపురం గ్రామస్తులు పలువురు కలెక్టరేట్ వచ్చారు. కూలినాలి చేసి జీవించే వాళ్లమని.. ఇందిరమ్మ ఇంటికి అర్హులమని.. గ్రామంలో రీ సర్వే చేసి అర్హులకు ఇళ్లు ఇప్పించాలని కలెక్టర్‌కు విన్నవించారు.
– తిరుమలగిరిసాగర్ మండలం చిల్లాపురం గ్రామస్తులు
నా కుటుంబాన్ని ఆదుకోండి..


