మిర్యాలగూడ: కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించిన 30వేల ఉద్యోగాలకు కేవలం కాల్ లెటర్ ఇచ్చి తామే ఇచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని ఎస్‌వీ గార్డెన్‌లో స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రులు మంచి చెడు ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్, నోముల భగత్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నాగర్ కర్నూల్, నల్లగొండ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్, కంచర్ల కృష్ణారెడ్డి, నాయకులు తిప్పన విజయసింహారెడ్డి, ఇంతియాజ్‌అలీ, చింతరెడ్డి శ్రీనివా స్‌రెడ్డి, నల్లమోతు సిద్ధార్థ, నూకల సరళహన్మంతరెడ్డి, బాలాజీనాయక్, లలితహాతీరాంనాయక్, అన్నభీమోజు నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివా స్‌రెడ్డి, నారాయణరెడ్డ, మోసిన్‌అలీ, యూసుఫ్, ఎండి.కరీం పాల్గొన్నారు.