జిల్లా మలేరియా అధికారిగా డాక్టర్‌ నగేష్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా మలేరియా అధికారిగా డాక్టర్‌ నగేష్‌

Jan 4 2026 6:58 AM | Updated on Jan 4 2026 6:58 AM

జిల్ల

జిల్లా మలేరియా అధికారిగా డాక్టర్‌ నగేష్‌

పెద్దవూర : జిల్లా మలేరియా అధికారిగా మండల వైద్యాధికారి డాక్టర్‌ నగేష్‌కు పదోన్నతి లభించింది. ఈయన పెద్దవూర మండల వైద్యాధికారిగా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఉత్తమ వైద్యాధికారిగా అవార్డులు సైతం పొందారు. డాక్టర్‌ రమేష్‌కు జిల్లా మలేరియా అధికారిగా పదోన్నతి లభించడంపై వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

న్యాయశాఖ ఉద్యోగుల క్యాలెండర్‌ ఆవిష్కరణ

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ హైదరాబాద్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాతంగి వీరబాబు ఉద్యోగుల సమస్యలను చీఫ్‌ జస్టిస్‌కు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌వి.సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి వివి.రమణారావు, రాష్ట్ర నాయకులు కోటిరెడ్డి, నరేష్‌, రాకేష్‌ పాల్గొన్నారు.

అభ్యంతరాలకు నేడు ఆఖరు

నల్లగొండ టూటౌన్‌ : మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా జాబితాలో తప్పులు, అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ఈనెల 4వ తేదీతో గడువు ముగియనున్నది. మున్సిపాలిటీల్లో పోలింగ్‌ స్టేషన్‌లు దాటిపోయి తమ ఓట్లు ఇతర వార్డుల్లో చేరాయని, వాటన్నింటిని తమ వార్డుల్లోకి చేర్చాలని కోరుతూ పలువురు రాజకీయ నాయకులు, ఓటర్లు మున్సిపల్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కాగా వార్డుల వారీగా ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఆదివారంలోగా మున్సిపల్‌ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.

విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ

నల్లగొండ : పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ డీడీ శశికళ అన్నారు. శనివారం నల్లగొండలోని షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ బాలికల క్యాంపస్‌లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు.

అసెంబ్లీలో స్పీకర్‌ వైఖరి దారుణం

దేవరకొండ : అసెంబ్లీలో స్పీకర్‌ వైఖరి దారుణమని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. శనివారం దేవరకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే స్పీకర్‌ మైక్‌ కట్‌ చేసి గొంతునొక్కడం సరికానద్నారు. అసెంబ్లీ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. స్పీకర్‌ ఏకపక్ష దోరణి, ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తిగా బహిష్కరించిందన్నారు. కాంగ్రెస్‌ పాలనతో ఎలాంటి మార్పు రాలేదని.. నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సమావేశంలో టీవీఎన్‌ రెడ్డి, బిల్యానాయక్‌, గాజుల ఆంజనేయులు, చింతపల్లి సుభాష్‌, వల్లపురెడ్డి, నీల రవి, ఖాదర్‌ బాబా, జానీబాబా, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు ఉన్నారు.

జిల్లా మలేరియా అధికారిగా డాక్టర్‌ నగేష్‌1
1/2

జిల్లా మలేరియా అధికారిగా డాక్టర్‌ నగేష్‌

జిల్లా మలేరియా అధికారిగా డాక్టర్‌ నగేష్‌2
2/2

జిల్లా మలేరియా అధికారిగా డాక్టర్‌ నగేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement