విజ్ఞానమివ్వని వైజ్ఞాన ప్రదర్శన! | - | Sakshi
Sakshi News home page

విజ్ఞానమివ్వని వైజ్ఞాన ప్రదర్శన!

Jan 4 2026 6:58 AM | Updated on Jan 4 2026 6:58 AM

విజ్ఞానమివ్వని వైజ్ఞాన ప్రదర్శన!

విజ్ఞానమివ్వని వైజ్ఞాన ప్రదర్శన!

అన్నీ పదేళ్ల కిందట రూపొందించినవే..

నల్లగొండ టూటౌన్‌ : ప్రపంచం ఒక వైపు నైపుణ్యతలో దూసుకుపోతుంటే జిల్లా విద్యాశాఖ మాత్రం పాత ప్రాజెక్టులతో వైజ్ఞానిక ప్రదర్శన పెట్టి మమ అనిపించిందనే విమర్శలు వెలువెత్తాయి. ప్రచార ఆర్భాటమే తప్ప విద్యార్థులతో కొత్త ప్రాజెక్టులు చేయించడంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు విఫలమయ్యారనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. పేరు పెద్ద ఊరు దిబ్బ అన్న చందంగా అధికారులు ఊదాసీనత వ్యవహరించడంతో ఎంతో భవిష్యత్‌ ఉన్న విద్యార్థుల చేత కొత్త పాజెక్టులను తయారీ చేయించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని డైట్‌ కాలేజీలో ఈ నెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌ విద్యార్థులకు విజ్ఞానమివ్వని వైజ్ఞానిక ప్రదర్శనగా మిగిలిందనే ఆరోపణలు వచ్చాయి. 280 ప్రాజెక్టులు అని డంబాచారంగా చెప్పుకున్న అధికారులు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రదర్శనలో పాత ప్రాజెక్టులే అధికంగా ఉన్నట్లు అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులే పెదవి విరుస్తున్నారంటే సంబంధిత అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్టుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పడం కోసం ఒకే రకమైన ప్రాజెక్టులే ఏర్పాటు చేశారు. ఎంతో సీరియస్‌గా తీసుకొని విద్యార్థుల చేత కొత్త ప్రాజెక్టులును తయారు చేయించాల్సి వారు ఏ మాత్రం ఉపయోగం లేని పాత ప్రాజెక్టులతో సైన్స్‌ ఫేర్‌ను మమ అనిపించినట్లు తెలుస్తోంది.

ఆర్భాటమే తప్ప ప్రయోజనం ఏదీ..!

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన మొత్తం పేలవంగా సాగింది. ప్రాజెక్టులను చూసేందుకు వివిధ పాఠశాలల నుంచి తీసుకువచ్చిన విద్యార్థులకు ఆ ప్రాజెక్టుల గురించి అర నిమిషం కూడా వివరించకుండా తీసుకువెళ్లడం చూస్తే వైజ్ఞానిక ప్రదర్శనపై సంబంధిత అధికారులకు ఎంత నిబద్దత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. లక్షల రూపాయల ఖర్చు చేసి.. కలెక్టర్‌, ఎస్పీ చేతులమీదుగా ప్రారంభించిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన ఎంత మంది విద్యార్థులకు ఉపయోగపడిందనే విషయం సంబంధిత అధికారులే చెప్పాలి. వైజ్ఞానిక ప్రదర్శన అని ఆర్భాటం చేయడం తప్ప క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు విద్యార్థుల చేత ఏఏ ప్రాజెక్టులు తయారు చేయించారన్న కనీసం సమాచారం కూడా అధికారులు తెలుసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంపై డీఈఓను వివరణ కోరేందుకు ఫోన్‌లో సంప్రదించగా.. స్పందించలేదు.

ఫ పాత ప్రాజెక్టులతో మమ అనిపించిన అధికారులు

ఫ ఆర్భాటం తప్ప.. ఆచరణలో లేని కొత్త ప్రాజెక్టులు

ఫ ఉన్న ప్రాజెక్టుల పనితీరు వివరించడంలోనూ లోపం

ఫ నల్లగొండలో ముగిసిన జిల్లాస్థాయి సైన్స్‌ ఫేర్‌

వైజ్ఞానిక ప్రదర్శనలో పెట్టిన వాటిలో ఎక్కువ ప్రాజెక్టులు చిన్న, చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలకు సంబంధించినవే ఉన్నాయి. అవి కూడా గత పదేళ్ల కిందటనే రూపొందించిన ప్రాజెక్టులు కావడం విస్మయానికి గురి చేస్తుంది. పాతదో కొత్తదో.. కనీసం పెట్టిన ప్రాజెక్టుల గురించి అక్కడికి వచ్చిన విద్యార్థులకు వాటి పరితీరును పూర్తిస్థాయిలో వివరించిన పాపాన కూడా పోలేదు. విద్యార్థులంతా క్యూలైన్‌లో వెళ్లి చూపి క్షణాల్లోనే బయటికి రావడంతో.. అవి ఏంటో కూడా ఏ విద్యార్థికి అర్థం కాకుండా పోయిందనే విమర్శలు వచ్చాయి. రావడం, పోవడం వ్యయ ప్రయాసాలు తప్ప వైజ్ఞానిక ప్రదర్శన వల్ల ఒనగూరిందేమీ లేదనే ఆరోపణలు వచ్చాయి. పది ప్రాజెక్టులు పెట్టినా వాటిలో నాలుగు ప్రయోజనకరంగా ఉంటే విద్యార్థులతో పాటు దేశానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లోనైనా కచ్చితత్వంతో కూడిన వైజ్ఞానిక ప్రదర్శనలో దేశానికి, ప్రజలకు ఉపయోగ పడే ప్రాజెక్టులు పెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని విద్యాశాఖ గ్రహించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement