మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు
నల్లగొండ రూరల్ : దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావాలని, అందుకు బీఆర్‌ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించాలని కోరుకుంటున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ మండలంలోని అప్పాజీపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కావాలని ప్రజలు నిలదీస్తుండడంతో ప్రధాని మోదీ అనేక ఆటంకాలు, అడ్డంకులు సృష్టించి తెలంగాణను చీకట్లోకి నెట్టే కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ చతికిల పడిందని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసినా, నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చినా ఏమీ చేయలని పరిస్థితిలో ఉందన్నారు. బీజేపీని ఎదుర్కునే సత్తా బీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. రాష్ట్రానికి కావాల్సిన రూ.30వేల కోట్లు కేంద్ర ఇవ్వడంలేదని బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వకుండా ప్రధాని మోదీ పోన్లు చేసి బ్యాంకర్లను బెదిరిస్తున్నట్లు మండిపడ్డారు. 20 శాతం విద్యుత్ చార్జీలు పెంచాలని, మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఇక్కడి రైతులపై కత్తిపెట్టిందన్నారు. గతంలో ఉన్న 12వేల కోట్లు విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రజల తరుపున కేంద్రానికి చెల్లించామే తప్ప ప్రజలపై భారం వేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అండగా ఉండి సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ ఆర్.శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, సీనియర్ నాయకులు కటికం సత్తయ్యగౌడ్, నిరంజన్ వలీ, పార్టీ మండల అధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, బకరం వెంకన్న, తవిటి కృష్ణ, బడుపుల శంకర్, రవీందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, గాదె రాంరెడ్డి, ధనలక్ష్మి, విమలమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్‌ఎస్‌కే ఉంది
ఫ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్‌రెడ్డి
ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన బీఆర్‌ఎస్ శ్రేణులు


