ఇబ్బంది పడుతున్నాం.. | - | Sakshi
Sakshi News home page

ఇబ్బంది పడుతున్నాం..

Nov 12 2026 1:07 AM | Updated on Nov 12 2026 1:07 AM

ఇబ్బంది పడుతున్నాం.. చదువుపై దృష్టి సారించలేకపోతున్నాం.. ప్రభుత్వం నుంచి సమాచారం లేదు..

మాది భూత్పూర్‌ మండలం మద్దిగట్ల గ్రామం. నేను రోజు బస్సులో నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలకు వస్తుంటాను. కళాశాలలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే మాలాంటి విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా పథకం అమలు చేయాలి.

– నందిని, ఇంటర్‌ విద్యార్థిని, బాలికల జూనియర్‌ కళాశాల, నాగర్‌కర్నూల్‌

మాది నాగర్‌కర్నూల్‌ మండలం శ్రీపురం గ్రామం. నేను రోజు బస్సులో జిల్లా కేంద్రానికి వచ్చి చదువుకుంటాను. కళాశాలలో మధ్యాహ్న భోజనం వసతి లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఉదయం బస్సు త్వరగా వచ్చిందని ఒక్కోసారి టిఫిన్‌ లేకుండా వస్తుంటాం. అప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నం తినకుండానే ఉంటుంటాం. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తే బాగుంటుంది. – స్పందన,

ఇంటర్‌ విద్యార్థిని, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, నాగర్‌కర్నూల్‌

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. విద్యార్థుల ఆకలి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పథకాన్ని అమలు చేస్తాం.

– వెంకటరమణ, డీఐఈఓ

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement