భూ అక్రమ బదలాయింపుపై పోలీసులకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

భూ అక్రమ బదలాయింపుపై పోలీసులకు ఫిర్యాదు

Nov 10 2026 1:01 AM | Updated on Nov 10 2026 1:01 AM

ఉప్పునుంతల: మండలంలోని అయ్యవారిపల్లి శివారు సర్వే నం.115లో 13.17 ఎకరాల భూమి బదలాయింపు వ్యవహారంలో అక్రమంగా ఫోర్జరీ పహాణిలు సమర్పించి రెవెన్యూ అధికారులను తప్పుదారి పట్టించారనే ఆరోపణలతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ మల్లెల స్వప్న సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో 9 మందిపై ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ ఫిర్యాదు చేసిన వారిలో అయ్యవారిపల్లికి చెందిన బూరం మల్లయ్య, ఆరెకంటి భగవంతు, తాడూరు రమేష్‌, బండమీది మహేష్‌, ఆరెకంటి స్వప్న, ఉప్పరి శోభ, బూరం సరిత, చౌట పుల్ల య్య, ఎడ్ల ఇంద్రజ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement