బాణాసంచా..
● ఆకాశంలో తారాజువ్వలు..
పాతాళంలో భూచక్రాలు
● దీపావళి నేపథ్యంలో జోరందుకున్న టపాసుల విక్రయాలు
● అమాంతం ఎగబాకిన రేట్లతో
సామాన్యుల బెంబేలు
● జిల్లాలో 50 మంది తాత్కాలిక దరఖాస్తు
అచ్చంపేట/ కందనూలు: చిన్నారులు, పెద్దలు తేడా లేకుండా అందరికీ ఎంతో ఇష్టమైన దీపావళి పండగ రానే వచ్చేసింది. ఈ నేపథ్యంలో బాణాసంచా కాల్చేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. ఇందుకోసం తాత్కాలిక లైసెన్స్‌దారులు జిల్లావ్యాప్తంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు 50 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో దాదాపు 14 టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయగా.. శనివారం బాణసంచా కొనుగోలు చేయడంతో దుకాణాల వద్ద సందడి కనిపించింది. అయితే టపాసుల ధరలు సామాన్యులను బెంబేలెత్తించాయి. తారాజువ్వల ధరలు ఆకాశాన్నంటగా.. భూచక్రాలు పాతాళానికి చేరాయి. ఈసారి 25 శాతం వరకు ధరలు పెరి గాయి. యూత్ సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉండే స్టాండర్డ్ క్రాకర్స్ తీసు కుంటున్నారు. మరోవైపు అమ్మకాలు మాత్రం ఏటేటా తగ్గుతున్నట్లు వ్యాపారులు వాపోతున్నారు.


