కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం

Nov 7 2026 1:18 AM | Updated on Nov 7 2026 1:18 AM

నాగర్‌ కర్నూల్‌: విధి నిర్వహణలో మృతి చెందిన ఆర్మ్‌డ్‌ రిజర్వు కానిస్టేబుల్‌ రాజు కుటుంబానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందించే రూ.కోటి విలువైన పోలీస్‌ శాలరీ ప్యాకేజ్‌ ఇ న్సూరెన్స్‌ చెక్కును ఎస్పీ డా.సంగ్రామ్‌ సింగ్‌ జి పాటిల్‌ శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. గత ఆగస్టులో సీఎం కొల్లాపూర్‌లో పర్యటించిన నేపథ్యంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజు విధులు ముగించుకొని తిరిగి నాగర్‌ కర్నూల్‌ వస్తున్న క్రమంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పోలీస్‌ శాలరీ ప్యాకేజ్‌ ఖాతా ఉ న్నందున, సంబంధిత బీమా నిబంధనల ప్రకా రం బ్యాంకు యాజమాన్యం రూ.కోటి పరిహా రాన్ని మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి కానిస్టేబుల్‌ రాజు లేని లోటు తీర్చలేనిదని, ఇటువంటి క్లిష్ట సమయంలో రాజు కుటుంబానికి పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఎస్‌బీఐ వారి కుటుంబానికి అందించిన పరిహారం ఆర్థికంగా ఆసరాగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్క సిబ్బంది పోలీస్‌ శాలరీ ప్యాకేజ్‌ చేయించుకోవాలని అదేవిధంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ కార్యాలయ ఏవో కృష్ణయ్య, ఆర్‌ఐ రాఘవరా వు, ఆర్‌ఎస్‌ఐ గౌస్‌ పాషా, జిల్లా పోలీస్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement