విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలి

Nov 7 2026 1:18 AM | Updated on Nov 7 2026 1:18 AM

కందనూలు: విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచుకుంటే సమాజ అభివృద్ధి, మానవ ప్రగతికి దోహదపడుతుందని డీఈఓ రమేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 32వ జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపు, వారిలో సృజనాత్మకతను వెలికితీయడానికి జాతీయ బాలల సైన్స్‌ ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు తమ పరిసరాల్లోని సమస్యలను గుర్తించి, వాటికి శాసీ్త్రయ పరిష్కారాలను అన్వేషించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కేవలం చదవడానికే పరిమితం కాకుండా.. ప్రయోగాలు, పరిశీలన, పరిశోధనల ద్వారా వాటిపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సైన్స్‌ అనేది కొత్త విషయాలను తెలుసుకోవడానికి, సమాజంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారాలను చూపడానికి ఉపయోగపడే ముఖ్యమైన సాధనం అన్నారు. జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో విద్యార్థులు తమ పరిశోధనాత్మక ప్రాజెక్టులను ప్రదర్శించారు. వివిధ అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డీఈఓ బహుమతులు అందజేశారు. రాష్ట్రస్థాయికి నాలుగు ప్రాజెక్టులను ఎంపిక చేసినట్లు జిల్లా సైన్స్‌ అధికారి శైలజ తెలిపారు. కార్యక్రమంలో ఏఎంఓ కిరణ్‌, జీహెచ్‌ఎం లత, జీసీడీఓ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement