ఉద్యోగాల సాధనకు పట్టుదలతో కృషిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల సాధనకు పట్టుదలతో కృషిచేయాలి

Nov 7 2026 1:18 AM | Updated on Nov 7 2026 1:18 AM

అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యువతకు కల్పిస్తున్న ఉచిత శిక్షణ అవకాశాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ అన్నారు. శుక్రవారం గిరిజన అభివృద్ధి శాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో అచ్చంపేట గిరిజన సంక్షేమ శాఖ యువజన శిక్షణ కేంద్రంలో పోలీస్‌ కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి స్టడీ మెటీరియల్‌, క్రీడా దుస్తులు, షూస్‌ ఉచితంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభ్యర్థులకు చదువుతోపాటు శారీరక దారుఢ్య అవసమన్నారు. అభ్యర్థులు పోలీస్‌, ఎస్‌ఐ ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకొని క్రమశిక్షణతో చదువుతూ.. ప్రతిరోజూ కష్టపడి మైదానంలో సాధన చేయాలన్నారు. వచ్చిన అవకాశం, సమయాన్ని వృథా చేయకుండా ఏకాగ్రతతో చదువుకోవాలని, శారీరక దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించేందుకు నిరంతరం సాధన చేయాలని సూచించారు. కొన్ని నెలలపాటు పట్టుదల, ప్రణాళికాబద్ధంగా కష్టపడితే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. కార్యక్రమంలో సహాయ గిరిజన అభివృద్ధి అధికారి నాగరాజు, హెచ్‌డబ్ల్యూఓ కాశన్న, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement