దివ్యాంగులకు న్యాయం చేయాలని వినతి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు న్యాయం చేయాలని వినతి

Nov 6 2026 1:56 AM | Updated on Nov 6 2026 1:56 AM

మన్ననూర్‌: రాష్ట్ర ప్రభుత్వం అటవీ సరిహద్దు ప్రాంతంలోని కుటుంబాలకు కల్పిస్తున్న పునరావాసం ప్యాకేజీలో దివ్యాంగులకు ప్రత్యేక అవకాశం కల్పించాలని సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రాజశేఖర్‌ అన్నారు. గురువారం అచ్చంపేటలో సబ్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీఓ సలోని ఛాబ్రాను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌టీసీఏ గైడ్‌ లైన్స్‌–2016 ప్రకారం పునరావాసం కోసం ప్రకటించిన మొత్తంతోపాటు దివ్యాంగులకు అదనంగా 25 శాతం కేటాయించాలనే నిబంధనను అనుసరిస్తూ దివ్యాంగులకు సరైన న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించిన సబ్‌ కలెక్టర్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి నిబంధనలకు అనుకూలంగా అనుసరిస్తూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

పుస్తక పఠనాన్ని

అలవాటుగా చేసుకోవాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకోవాలని పీయూ వీసీ శ్రీనివాస్‌ సూచించారు. పీయూ లైబ్రరీలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పుస్తక ప్రదర్శనను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుస్తకాలు చదవడం వల్ల ఉన్నత విద్య, పరిశోధనతో పాటు పోటీ పరీక్షల్లో రాణించేందుకు అవసరమైన జ్ఞానం లభిస్తుందని పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత పెంపొందించుకోవడానికి పఠనం దోహదపడుతుందన్నారు. పీయూలో పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు వివిధ మ్యాగజైన్లు, దినపత్రికలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గొప్ప వ్యక్తులు పుస్తక పఠనం ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, కంట్రోలర్‌ ప్రవీణ, ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి, ఈశ్వర్‌కుమార్‌, భూమయ్య, కరుణాకర్‌రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌, అర్జున్‌కుమార్‌, కోఆర్డినేటర్‌ జయనాయక్‌ పాల్గొన్నారు.

7న ఉమ్మడి జిల్లా అథ్లెటిక్స్‌ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఈనెల 7వ తేదీన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 ఉమ్మడి జిల్లా బాలబాలికల అథ్లెటిక్స్‌ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు బోనఫైడ్‌, ఆధార్‌కార్డులతో ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement