పట్టభద్రుల ఓటరు నమోదు వేగిరం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఓటరు నమోదు వేగిరం చేయాలి

Nov 6 2026 1:56 AM | Updated on Nov 6 2026 1:56 AM

కందనూలు/ తెలకపల్లి: పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు అర్హులైన వారి దరఖాస్తులను నిబంధనల ప్రకారం గడువులోగా పరిశీలించి ఆమోదించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చెన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పురోగతి, ఇప్పటివరకు నమోదైన ఓటర్ల వివరాలు, దరఖాస్తుల పరిశీలన స్థితిని కలెక్టర్‌ వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 38,377 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, వీటిలో 80 శాతం దరఖాస్తులను పరిశీలించి ఆమోదించామన్నారు. పెండింగ్‌లో ఉన్న 1,426 దరఖాస్తులను గడువులోగా పరిశీలించి అర్హతల ఆధారంగా ఓటర్లుగా నమోదు చేస్తామని చెప్పారు. ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వీసీలో ఆర్డీఓలు అర్చన, బన్సీలాల్‌, జనార్దన్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ రవికుమార్‌, ఎన్నికల డీటీ కల్పన తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా భూ రీ సర్వే

భూ రీ సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ అన్నారు. తెలకపల్లి మండలంలోని గౌతంపల్లిలో ఆయన భూ రీ సర్వేను పరిశీలించారు. భూ సర్వే పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూముల నుంచి రైతులు స్వీకరించిన నీటిపారుదల భూముల వివరాలను పరిశీలించారు. భూముల సరిహద్దులు, విస్తీర్ణం భూ యాజమాన్యానికి పరిశీలించి నమోదు చేయాలన్నారు. భూముల సర్వే వివరాలు స్పష్టంగా ఉండాలన్నారు. రైతులకు సందేహాలు ఉంటే రికార్డులతో సరి పోల్చుకోవాలని, భూముల వర్గీకరణలో స్పష్టత ఉండాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, సర్వేయర్‌ శివరంజని, డీపీఓ రాంగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement