ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

Nov 6 2026 1:56 AM | Updated on Nov 6 2026 1:56 AM

కొల్లాపూర్‌/ కందనూలు: ఎన్‌హెచ్‌ఎం ఉధ్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సంఘం ప్రతినిధులు గురువారం కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి.. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. తాము 24 రోజులుగా శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని, తమను రెగ్యులరైజ్‌ చేయాలని, వేతనాలు పెంచాలని వినతిలో కోరారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లను కేబినెట్‌ సమావేశంలో చర్చిస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కుమార్‌, పరశురాం, గోపి, మంజుల, హరిసురేష్‌, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ ఎదుట 24 రోజులుగా చేస్తున్న సమ్మెను ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లామని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లేలా కృషిచేస్తానన్నారు. ఉద్యోగులు అధైర్యపడకుండా సంయమనంతో, ఐక్యంగా తమ పోరాటాన్ని కొనసాగించాలని, తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సునేంద్ర, పట్టణ అధ్యక్షుడు జక్కరాజు, ఎన్‌హెచ్‌ఎం సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కుమార్‌, ప్రతినిధులు శ్రీనివాసులు, ప్రవీణ్‌, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement