ఉప్పునుంతల: వీబీజీ రాంజీ ఉపాధి హామీ పనులపై ప్రత్యేక శ్రద్ధపెట్టి కూలీల సంఖ్య పెంచాలని, వచ్చే వారం నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో వంద మందికిపైగా కూలీలు పనులకు వచ్చేవిధంగా చూడాలని డీఆర్డీఓ చిన్న ఓబులేసు అన్నారు. గురువారం ఉప్పునుంతల కేజీబీవీ సమీపంలో కొనసాగుతున్న కేఎల్ఐ కాల్వ పూడికతీత, శుభ్రం చేసే పనులు, గుట్టమీదితండా రోడ్డుకు ఇరువైపులా మొక్కల ప్లాంటేషన్‌ను డీఆర్డీఓ పరిశీలించారు. పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో తోటి కూలీలను పనులకు తీసుకురావాలని సూచించారు. కరువు నేపథ్యంలో కూలీలు ఈజీఎస్ పనులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఆయన వెంట ఎంపీడీఓ వరుణ్‌తేజ, ఈజీఎస్ ఏపీఓ పర్వతాలు, టీఏ సింగోటం, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లయ్య తదితరులున్నారు.


