జాతీయ దంతవైద్య బోర్డు సభ్యుడిగా రాజేశ్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

జాతీయ దంతవైద్య బోర్డు సభ్యుడిగా రాజేశ్‌రెడ్డి

Nov 5 2026 1:10 AM | Updated on Nov 5 2026 1:10 AM

నాగర్‌కర్నూల్‌: స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర డెంటల్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డా.కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డికి జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యత లభించింది. జాతీయ దంత వైద్య కమిషన్‌ పరిధిలోని అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డెంటల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు స్వయం ప్రతిపత్తి సంస్థ పార్ట్‌టైమ్‌ సభ్యుడిగా ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి బుధవారం నియమితులయ్యారు. కేంద్ర పాలిత, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున 10 మంది, రాష్ట్ర డెంటల్‌ కౌన్సిళ్ల తరఫున 9 మంది పార్ట్‌టైమ్‌ సభ్యులను రెండేళ్ల పదవీ కాలానికి ఎంపిక చేశారు. ఇప్పటికే జాతీయ దంత వైద్య కమిషన్‌ సభ్యుడిగా కొనసాగుతున్న రాజేశ్‌రెడ్డికి తాజాగా అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డెంటల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు సభ్యుడిగా అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

నీటి కుంటల నిర్మాణానికి ముందుకురావాలి : డీఏఓ

కల్వకుర్తి రూరల్‌: ఎల్‌నినో వంటి పరిస్థితులను అధిగమించేందుకు భూగర్భజలాలను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని.. రైతులు తమ వ్యవసాయ పొలాల్లో నీటి కంటల నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకురావాలని డీఏఓ యశ్వంత్‌రావు కోరారు. బుధవారం కల్వకుర్తి మండలం మార్చాలలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వీబీ–జీ రామ్‌జీ పథకం ద్వారా రూ.1.25 లక్షలతో నీటి కుంటలు నిర్మించుకునేందుకు అవకాశం ఉందన్నారు. వీటి నిర్మాణంతో భూగర్భజలాలు కొంతమేర పెరగడంతో పాటు నిల్వ ఉండే నీటితో రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా నీటి కుంటల నిర్మాణాలను పెద్దఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో ఏడీఏ మంజుల, ఎంపీడీఓ యాదయ్య, ఏఓ సురేష్‌, వెటర్నరీ డాక్టర్‌ వెంకటేశ్‌, సర్పంచ్‌ తలసాని కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్‌ నిజాముద్దీన్‌ ఉన్నారు.

సైబర్‌ మోసాలపై

అప్రమత్తత అవసరం

కందనూలు: రోజురోజుకూ సైబర్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరముందని అడిషనల్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బిజినేపల్లి మండలం పాలెం డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్‌కు వచ్చే సందేశాలకు స్పందించడం, వ్యక్తిగత సమాచారం ఇతరులకు ఇవ్వడం వంటివి చేయరాదన్నారు. అలాగే ఫ్రాడ్‌ కాల్స్‌, నకిలీ ట్రెడింగ్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, నకిలీ సంస్థల పేర్లు, లోగోలతో వచ్చే పెట్టుబడి ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. అనంతరం సైబర్‌ క్రైం పోస్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీసీఎల్‌ సీఐ శంకర్‌, ఎస్‌ఐ శంషొద్దీన్‌, సైబర్‌ క్రైం ఎస్‌ఐ గిరిమనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

కొల్లాపూర్‌ రూరల్‌: గిరిజన రైతులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు అశోక్‌ నాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని ముక్కిడిగుండంలో పోడు రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవిలో నివాసిస్తూ, జీవనోపాధి కోసం పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. అటవీశాఖ అధికారులు వేధింపులను ఆపడంతో పాటు అటవీ ప్రాంతంలోని చెంచుగూడెలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. లేనిచో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement