చదువుతోనే సమాజంలో గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే సమాజంలో గుర్తింపు

Nov 5 2026 1:10 AM | Updated on Nov 5 2026 1:10 AM

పాన్‌గల్‌: మహిళలు అక్షరాస్యులైనప్పుడే ఆత్మ విశ్వాసం, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లి, కేతేపల్లి, శాగాపూర్‌, దావత్‌ఖాన్‌పల్లి, రాయినిపల్లిలో పర్యటించి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి చదవడం, రాయడం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, చదువుకోకుంటే నిలిపివేస్తామని చెప్పారు. గ్రామాల్లోని మహిళలకు రోజు ఉదయం, సాయంత్రం గంట పాటు చదువు నేర్పించేందుకు ఉపాధ్యాయులను నియమించాలని తెల్లరాళ్లపల్లి సర్పంచ్‌ జంబులయ్యకు సూచించారు. మహిళలకు చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు చదవడం, రాయడం ముందుగా నేర్చుకునే మహిళకు రూ.5 వేలు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని మంత్రి ప్రకటించారు. వేలిముద్రకు స్వస్తి పలికి ప్రతి ఒక్కరు పేరు రాయడం నేర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వృఽథా ఖర్చులు చేయకుండా తమ పిల్లలను మంచిగా చదివించాలని.. చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులకే ప్రతి నెల రూ.ఏడు వేల కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలిపారు.

పలు అభివృద్ధి పనులకు భూమిపూజ..

మండలంలోని కేతేపల్లిలో రూ.20 లక్షల ఎస్‌డీఎఫ్‌ నిధులతో నిర్మించే కురువ కమ్యూనిటీ హాల్‌, దావత్‌ఖాన్‌పల్లిలో రూ.20 లక్షలతో నిర్మించే జీపీ భవనం, రాయినిపల్లిలో రూ.10 లక్షలతో నిర్మించే గ్రామ వీఓ భవనానికి మంత్రి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కార్తీక్‌రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు జంబులయ్య, మైబూషమ్మ, స్వప్న, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్‌నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రవికుమార్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్య క్షులు హేమాద్రినాయుడు, భాస్కర్‌యాదవ్‌, రాము యాదవ్‌, మధుసూదన్‌రెడ్డి, బాలరాజుయాదవ్‌, అరవింద్‌ చౌహాన్‌, గిరినాయుడు, తహసీల్దార్‌ కార్తీక్‌రావు, ఎంపీడీఓ గోవింద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement