ఆగుతూ.. సాగుతూ! | - | Sakshi
Sakshi News home page

ఆగుతూ.. సాగుతూ!

Nov 2 2026 12:41 AM | Updated on Nov 2 2026 12:41 AM

త్వరలో ప్రక్రియ.. భూ సేకరణలో నిర్లక్ష్యం.. వంతెన వెడల్పు, ఎత్తు సరిపోతుందా?

ఇదీ పరిస్థితి..

మందకొడిగా 167కే జాతీయ రహదారి పనులు

● హైవే నిర్మాణానికి అడ్డంకిగా మారిన భూ సేకరణ

● నాగర్‌కర్నూల్‌ వద్ద నిలిచిన బైపాస్‌ ఫ్లైఓవర్‌ పనులు

● మూడేళ్లు దాటినా పూర్తికాని రహదారి

–8లో u

నాగర్‌కర్నూల్‌ వద్ద బైపాస్‌ నిర్మాణానికి సంబంధించి 4 కి.మీ. మేర భూసేకరణ పెండింగ్‌లో ఉంది. 24.28 ఎకరాల భూ సేకరణ పూర్తయితే పనులు వేగంగా సాగుతాయి. తాడూరు వైపు నుంచి నిలిచిన పనులు ప్రారంభించాం. కొల్లాపూర్‌ చౌరస్తా నుంచి భూసేకరణ అనంతరం పనులు మొదలవుతాయి. కొట్ర వద్ద 600 మీటర్ల పనులు చేయాల్సి ఉంది. కోర్టు కేసుతో నిలిచింది. జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం వంతెనలు నిర్మిస్తున్నాం. – రమేశ్‌,

డీఈఈ, జాతీయ రహదారుల సంస్థ

అచ్చంపేట: ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే కల్వకుర్తి – నంద్యాల (167కే) జాతీయ రహదారి పనులు ముందుకు సాగడం లేదు. పూర్తిస్థాయిలో భూ సేకరణ జరగకపోవడం పనులకు అడ్డంకిగా మారింది. 2021లో ప్రభుత్వం 173.73 కి.మీ ఎన్‌హెచ్‌–167కే మంజూరు చేస్తూ.. ఐదు ప్యాకేజీలుగా విభజించింది. మొదటి దశ పనులు 2022 సెప్టెంబర్‌లో కల్వకుర్తి (కొట్ర) నుంచి సోమశిల రహదారి విస్తరణ, బైపాస్‌ నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించారు. ఈ పనులను రూ. 436.91 కోట్లకు ఓ సంస్థ దక్కించుకోగా.. 2023 జూలైలో అధికారికంగా పనులను ప్రారంభించారు. ఇప్పటికీ మూడేళ్లు దాటినా జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై పాలకులు, అధికారుల చిత్తశుద్ధిని వేలెత్తి చూపేలా కనిపిస్తోంది. తెలంగాణ వైపు సోమశిల (మల్లేశ్వరం) 87.360 కి.మీ నుంచి ఏపీ అవతల సిద్దేశ్వరం గుట్ట 88.437 కి.మీ. వరకు 1,077 మీటర్ల పొడవునా తీగల వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇది పూర్తయితేనే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల సమస్య తీరుతుంది. ఇందుకోసం 59 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇందులో 25 హెక్టార్ల అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా అమ్రాబాద్‌ మండలంలో భూమి కేటాయించారు. 34 హెక్టార్లకు సంబంధించిన పరిహారం చెల్లింపులో ఆలస్యమవుతోంది. రెండో ప్యాకేజీలో ఏపీలోని సంగమేశ్వరం – కపిలేశ్వరం మధ్య చేపట్టే 5 కి.మీ. అప్రోచ్‌ రోడ్డు నిర్మాణంలో 29 హెక్టార్ల అటవీ భూమి కోల్పోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించాల్సి ఉండగా.. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు భూసేకరణ చేయకపోవడంతో వంతెన నిర్మాణంలో ఆలస్యమవుతోందని తెలుస్తోంది. అత్మకూరు – వెలుగోడు మధ్య 15 కి.మీ. మేర కొత్తపల్లి మండలం ఎర్రమఠం, ముసలిమడుగు నల్లమల అటవీ అనుమతులు ఆటంకంగా మారాయి. అయితే అధికారులు ప్రత్నామ్నాయ మార్గంపై ప్రణాళికలు రూపొందించినప్పటికీ రహదారి పనులు ముందుకు సాగడం లేదు.

కల్వకుర్తి నుంచి కొల్లాపూర్‌ బైపాస్‌లోని సోమశిల రహదారి వరకు 79 కి.మీ. నిర్మాణానికి గాను ఇప్పటి వరకు 74.5 కి.మీ. మేర 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల బీటీ పనులు పూర్తయ్యాయి. కొట్ర వద్ద శ్రీశైలం జాతీయ రహదారి–765ని కలుపుతూ చేపట్టాల్సిన 600 మీటర్ల రోడ్డు పనులు సైతం కోర్టు కేసు వల్ల నిలిచిపోయాయి. కల్వకుర్తి, సింగోటం క్రాస్‌రోడ్డు, పెంట్లవెల్లి వద్ద అండర్‌ పాస్‌లు నిర్మించారు. నాగర్‌కర్నూల్‌ వద్ద 11 కి.మీ. బైపాస్‌ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ జరగకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. తాడూరు నుంచి నాగర్‌కర్నూల్‌ వరకు 7 కి.మీ. మేర భూ సేకరణ పూర్తికాగా.. కొల్లాపూర్‌ క్రాస్‌రోడ్‌ నుంచి దేశిఇటిక్యాల వరకు 4 కి.మీ. మేర భూసేకరణ పూర్తి కాలేదు. రోడ్డు నిర్మాణం కోసం 24.28 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. అవసరమైన మేర చెల్లింపులు జరపకపోవడాన్ని పరిశీలించాలని బాధిత రైతులు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే భూ సేకరణకు ఇచ్చిన 60 రోజుల గడువు పూర్తయినా అడుగు ముందుకు పడటం లేదు. ఫలితంగా నాగర్‌కర్నూల్‌ వద్ద బైపాస్‌ నిర్మాణం పిల్లర్లకే పరిమితమైంది. భూసేకరణ సమస్యతో కొల్లాపూర్‌ వరిదేల రెవెన్యూ శివారు 79 కి.మీ. నుంచి మల్లేశ్వరం (సోమశిల) కృష్ణానది గుట్ట 87,360 కి.మీ (ఐకానిక్‌ వంతెన) వరకు 8 కి.మీ. అప్రోచ్‌ రోడ్డు పనులు కూడా నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement