ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Nov 2 2026 12:41 AM | Updated on Nov 2 2026 12:41 AM

● మురసు తుఫాన్‌తో భారీ వర్షాలు కురిసే అవకాశం

● జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌

● కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌: మురసు తుఫాన్‌ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ఉదయం 8:30 నుంచి మంగళవారం ఉదయం 8:30 గంటల వరకు జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 3, 4 తేదీల్లో ఎల్లో అలర్ట్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. రాత్రి నుంచి గంటకు 60 నుంచి 90 కి.మీ. వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కలెక్టర్‌ సూచించారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగ్‌ల కింద ఆశ్రయం పొందవద్దని తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, వాగులు, వంకలను దాటేందుకు ప్రయత్నించవద్దని తెలిపారు. తుఫాన్‌ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ 08540–230201ను సంప్రదించాలని కలెక్టర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement