పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

Nov 2 2026 12:41 AM | Updated on Nov 2 2026 12:41 AM

వెల్దండ: త్వరలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టభద్రులందరూ విధిగా తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఆదివారం మండలంలోని చౌదర్‌పల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలోనే రైతులు, ప్రజా సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేశామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజలను మోసం చేసిందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కోరారు. అనంతరం పట్టభద్రులతో ఓటరు నమోదు చేయించారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎడ్మ సత్యం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పుట్టా రాంరెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్లు శేఖర్‌ ముదిరాజ్‌, నాగులునాయక్‌, మాజీ సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, నిరంజన్‌, బాలయ్య, అంజి మాస్టర్‌, అశోక్‌, ఆనంద్‌, బాబురావు, అంజినాయక్‌, రాజు, అశోక్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement