ప్రపంచ నియంతలకు కాలం చెల్లింది | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ నియంతలకు కాలం చెల్లింది

Nov 1 2026 7:19 AM | Updated on Nov 1 2026 7:19 AM

తిమ్మాజిపేట: ప్రపంచ వ్యాప్తంగా నియంతలుగా వ్యవహరించిన దేశాధినేతలకు సందర్భానుసారంగా కాలం చెల్లిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని లక్ష్మణాచారి భవనంలో ఆనంద్‌జీ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోని కొందరు నియంతలైన దేశాధినేతలు మూడు నెలల వ్యవధిలోనే జరిగిన ఎన్నికలలో ఓడిపోవడం గమనార్హమన్నారు. కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం ఉన్న దేశాలు బ్రెజిల్‌, ఫ్రాన్స్‌ ఇతర దేశాలలో కమ్యూనిస్టు పార్టీల ప్రభుత్వాలు రావడం ఇందుకు నిదర్శనం అన్నారు. అదేవిధంగా కుల, మతాలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అంతమయ్యే రోజులు వస్తాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసనలు చేసేందుకు వేదికగా ఉన్న జంతర్‌ మంతర్‌ ఉండేదన్నారు. ఇటీవల ఢిల్లీలో నిరసనలు చేపడితే కేంద్రం అక్కడ నిషేధం విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించి ప్రజాస్వమ్యానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. కరువు పరిస్థితుల దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌, నాయకులు వెంకటయ్య, నర్సింహ, చంద్రమౌళి, సూర్యశంకర్‌గౌడ్‌, వెంకటయ్య, రవీందర్‌, శివుడు, లక్ష్మీపతి, మధుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement