నాగర్‌కర్నూల్: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేతులకు తాళ్లతో కట్టెసుకొని వినూత్నంగా నిరసన చేపట్టారు. కలెక్టరేట్ ఎదటు ఎదుట తమను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 19వ రోజు చేరింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాల నుంచి విముక్తి కల్పించి తమ కుటుంబాలకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ 19 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలందించిన తమ సేవలను గుర్తించాలని కోరారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న 78 కేడర్ల ఉద్యోగులకు నేటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం విచారకరమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి తమను రెగ్యులరైజ్ చేయడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్‌పాషా, హైమావతి, శ్రీనివాసులు, రామకష్ణ, ప్రవీణ్‌కుమార్, గోపి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


