అమెరికా ప్రొఫెసర్‌తో బల్మూర్‌ విద్యార్థుల ముఖాముఖి | - | Sakshi
Sakshi News home page

అమెరికా ప్రొఫెసర్‌తో బల్మూర్‌ విద్యార్థుల ముఖాముఖి

Nov 1 2026 7:19 AM | Updated on Nov 1 2026 7:19 AM

బల్మూర్‌: పీఎంశ్రీ స్కూల్స్‌ ఇంటర్నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ టాక్‌లో భాగంగా బల్మూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నిపుణుడితో మాట్లాడే అవకాశం లభించింది. అమెరికాలోని నార్త్‌ కరోలినా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గడ్డమీది శోభన్‌బాబు శనివారం ఆన్‌లైన్‌ ద్వారా పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ బల్మూర్‌ పాఠశాల విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ చదువు పట్ల శ్రద్ధ ఎలా పెంచుకోవాలి.. జీవితంలో లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలని.. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి కృషి చేయాలో వివరించారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను సులభంగా గుర్తుంచుకునే మెళకువలు, జ్ఞాపకశక్తి పెంపుపై సూచనలు ఇచ్చారు. విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎలా ఎదగాలో అవగాహన కల్పించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలు చెప్పారు. ప్రస్తుతం క్యాన్సర్‌ రావడానికి గల కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు తెలిపిన ప్రొఫెసర్‌ శోభన్‌బాబు క్యాన్సర్‌ కారకాలు, నివారణ చర్యలపై విద్యార్థులతో చర్చించారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు సమాధానాలిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం రజాక్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement