కరువు కాటు! | - | Sakshi
Sakshi News home page

కరువు కాటు!

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

13 మండలాల్లో లోటు వర్షపాతం..

రెండు మండలాల్లో మోస్తరు..

13 మండలాల్లో కమ్మేసిన కరువు ఛాయలు

పొడి వాతావరణంతో పంటలకు నష్టం..

వర్షం లోటు..

● జిల్లాలో లోటు వర్షపాతమే

ప్రధాన కారణం

● డ్రై స్పెల్స్‌తో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం

● కరువు సహాయక చర్యలకు

యంత్రాంగం సిద్ధం

జిల్లాలోని 13 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అచ్చంపేటలో సాధారణం కంటే 26 శాతం, అమ్రాబాద్‌లో 54 శాతం, బల్మూరులో 25 శాతం, బిజినేపల్లిలో 33 శాతం, చారకొండలో 20 శాతం, కల్వకుర్తిలో 35 శాతం, కోడేరులో 9 శాతం, లింగాలలో 43 శాతం, పదరలో 61 శాతం, పెద్దకొత్తపల్లిలో 45 శాతం, ఊర్కొండలో 35 శాతం, వంగూరులో 17 శాతం, వెల్దండలో 34 శాతం వర్షపాతం లోటు నమోదైంది. వీటిలో పదర, అమ్రాబాద్‌, పెద్దకొత్తపల్లి, లింగాల మండలాల్లో లోటు అధికంగా ఉంది.

నాగర్‌కర్నూల్‌: జిల్లాను కరువు ఛాయలు కమ్మేశాయి. వర్షాభావ పరిస్థితులు, వరుసగా ఏర్పడిన పొడి వాతావరణం, పంటలకు సరిపడా తేమ అందకపోవడం వంటి అంశాలు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. జిల్లాలోని 13 మండలాలను కరువు మండలాలుగా గుర్తించింది. వర్షపాతం లోటుతో పాటు పంటల సాగు విస్తీర్ణంలో తేమ పరిస్థితులు, వృక్ష సంపద స్థితిగతులు కరువు తీవ్రతను సూచిస్తున్నాయి. మండలాల వారీగా పరిశీలిస్తే.. 11 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, రెండు మండలాల్లో మోస్తరు పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దిగుబడులపై ప్రభావం..

పంట పొలంలో ఎంతమేర తేమ అందుబాటులో ఉందో సూచించే మాయిశ్చర్‌ అడెక్వసీ ఇండెక్స్‌ (ఎంఏఐ)ను పరిశీలిస్తే.. 13 మండలాల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అర్థమవుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు అవసరమైన తేమ అందకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగుచేసే రైతులకు ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

వృక్ష సంపదపైనా..

వెజిటేషన్‌ కండిషన్‌ ఇండెక్స్‌ (వీసీఐ) ప్రకారం పంటలతో పాటు వృక్ష సంపదపైనా ఈ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అమ్రాబాద్‌, బల్మూరు, పెద్దకొత్తపల్లి, పదర మండలాల్లో తీవ్ర పరిస్థితులు నమోదయ్యాయి. మిగిలిన మండలాల్లోనూ మోస్తరు నుంచి తీవ్ర స్థాయి వరకు ప్రభావం ఉన్నట్లు నివేదిక సూచిస్తోంది. పంటలతో పాటు వృక్ష సంపద పరిస్థితులు కూడా కరువు తీవ్రతను అంచనా వేయడంలో కీలకంగా మారాయి.

అచ్చంపేట, బిజినేపల్లి మండలాల్లో మోస్తరు కరువు పరిస్థితులు ఉండగా.. అమ్రాబాద్‌, బల్మూరు, చారకొండ, కల్వకుర్తి, కోడేరు, లింగాల, పదర, పెద్దకొత్తపల్లి, ఊర్కొండ, వంగూరు, వెల్దండ మండలాల్లో తీవ్ర పరిస్థితులు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు.

ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలకు అవసరమైన తేమ అందలేదు. వర్షాలు లేకుండా గడిచిన రోజులు (డ్రై స్పెల్స్‌) కూడా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం అమ్రాబాద్‌లో మూడు డ్రై స్పెల్స్‌ నమోదు కాగా.. బల్మూరు, లింగాల, పదర మండలాల్లో రెండేసి నమోదయ్యాయి. మిగిలిన మండలాల్లో ఒక్కో డ్రై స్పెల్‌ నమోదైంది. వర్షాల మధ్య విరామం పెరగడం, నేలలో తేమ తగ్గడం పంటల ఎదుగుదలపై ప్రభావం చూపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement