రైతుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

కొల్లాపూర్‌: రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు ఆరోపించారు. శుక్రవారం పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు వారాల క్రితం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించినప్పుడు సాగు, తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటి పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు జిల్లా అధికారులను కోరామని చెప్పారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేల పరిహారం ఇవ్వాలని విన్నవించామని తెలిపారు. అయితే మంత్రి, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. నాగర్‌కర్నూల్‌, వనపర్తి కలెక్టర్లు స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని తేల్చిచెప్పారు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు బస్టాండ్‌ ఎదుట పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, రైతులు కూర్చున్నారు. ధర్నా విరమించాలని స్థానిక సీఐ శంకర్‌నాయక్‌తో పాటు ఎస్‌ఐలు పలుమార్లు సుధాకర్‌రావును కోరారు. అయితే అఽధికారులు వచ్చి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని చెప్పడంతో ఆర్డీఓ కార్యాలయ ఏఓను పిలిపించి మాట్లాడించారు. అయితే కిందిస్థాయి అధికారులు కాదని.. కలెక్టర్‌ లేదా ఆర్డీఓ తమకు హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో జనం ఎక్కువగా పోగుకాకుండా బస్టాండ్‌ పరిసరాల్లో వ్యాపార దుకాణాలను పోలీసులు మూసి వేయించారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. రాత్రి 9 గంటలకు బస్టాండ్‌ గేటు వద్దే బీజేపీ నాయకులు, రైతులు భోజనాలు చేశారు. 10 గంటల ప్రాంతంలో సుధాకర్‌రావుతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ధర్నాలో నాయకులు ధారాసింగ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, సందు రమేశ్‌, శేఖర్‌గౌడ్‌, జగ్గారి శ్రీధర్‌రెడ్డి, భీమేష్‌, గడ్డం శేఖర్‌యాదవ్‌, పరమేష్‌, భరత్‌చంద్ర తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement