చారకొండ: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చేపట్టిన రీ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చెన్నయ్య అన్నారు. చారకొండ మండలం గోకారం రెవెన్యూ శివారులోని చంద్రాయన్‌పల్లిలో నిర్వహిస్తున్న భూముల రీ సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వేలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రైతులు సహకరించాలన్నారు. వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ ఉమ, సర్పంచులు పరుశరాములు, శంకర్ ముదిరాజ్, ఆర్‌ఐ సుజాత, సర్వేయర్ అనూష, జీపీఓ ఆంజనేయులు ఉన్నారు.


