రెండు చోట్లా 25 ఎకరాల చొప్పున.. | - | Sakshi
Sakshi News home page

రెండు చోట్లా 25 ఎకరాల చొప్పున..

Oct 29 2026 12:48 AM | Updated on Oct 29 2026 12:48 AM

చర్మ ఉత్పత్తుల పరిశ్రమల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అప్పట్లో లెదర్‌ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా 2002లో జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌ సమీపంలో లిడ్‌క్యాప్‌ (చర్మ ఉత్పత్తుల పారిశ్రామిక అభివృద్ధి సంస్థ)కు 25 ఎకరాల అసైన్డ్‌ భూమిని కేటాయించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం జినుకుంటలో మరో 25 ఎకరాలు కేటాయించారు. 2004లో పోలేపల్లిలో ‘మలుపు’ పథకం కింద సుమారు రూ.10 లక్షలతో భవనాన్ని నిర్మించారు. జినుకుంటలో రూ.25 లక్షలతో మరో భవనం ఏర్పాటు చేశారు. చర్మ ఉత్పత్తుల తయారీకి అవసరమైన యంత్ర సామగ్రి కోసం సుమారు రూ.2 కోట్లు వెచ్చించారు. అయినప్పటికీ, ఆశించిన స్థాయిలో పరిశ్రమలు ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement