కొల్లాపూర్/ పెద్దకొత్తపల్లి/ కోడేరు: పంటల సాగు కోసం రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు అన్నారు. శనివారం కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలోని సబ్‌స్టేషన్ల ముందు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతుల పంటలు ఎండిపోయే దశకు చేరాయని ఆరోపించారు. రైతుల కరెంట్ కోసం నేను జైలుకు వెళ్లానని గొప్పలు చెప్పుకొనే మంత్రి జూపల్లి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, రైతుల అవసరాల మేరకు విద్యుత్ సరఫరా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు సాగుచేసిన వరి, మినుము, వేరుశనగ పంటలను కాపాడేందుకు నానా అవస్థలు పడుతున్నారన్నారు. దీనికితోడు లో ఓల్టేజీ సమస్యతో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి రైతులపై అదనపు భారం పడుతుందని వాపోయారు. ఇప్పటికై నా మంత్రి జూపల్లి స్పందించి వ్యవసాయానికి మెరుగైన విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. నాయకులు శ్రీనివాస్‌యాదవ్, శేఖర్‌గౌడ్, రమేష్, పరమేష్, భరత్‌చంద్ర, పరశురాం, తిరుమల్, మల్లేష్, నాగరాజు, లింగన్‌గౌడ్, తిర్మల్‌యాదవ్, యాదయ్య, రైతులు పాల్గొన్నారు.


