వరి కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

వరి కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలి

Oct 25 2026 1:05 AM | Updated on Oct 25 2026 1:05 AM

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో 2026– 27 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్లను ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్‌ సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారానే నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ చెన్నయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 183 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, చెత్త, తాలు, మట్టి, రాళ్లు లేకుండా శుభ్రపరిచి తీసుకురావాలని సూచించారు. ధాన్యంలో తేమ శాతం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు, తాగునీరు సహా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రాన్ని జియో ట్యాగింగ్‌ చేసి, కేంద్రాల వివరాలు, మౌలిక సదుపాయాల ఫొటోలు, ఆధారాలను పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ధాన్యం రవాణా, నిల్వకు అవసరమైన గిడ్డంగి సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని, వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. కొనుగోలులో పారదర్శకత పాటిస్తూ, రైతులకు కనీస మద్దతు ధర సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు. కాగా గ్రేడ్‌–ఏ రకం ధాన్యం క్వింటాకు రూ.2,461 కనీస మద్దతు ధరగా ప్రకటించిందన్నారు. అలాగే ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాల ధాన్యానికి క్వింటాకు రూ.500 అదనపు బోనస్‌ అందిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement