మిగులు విద్యుత్ విక్రయిస్తున్నాం..
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి..
పర్యావరణానికి మేలు..
పీఎం సూర్య ఘర్‌తో ఇంటింటా సౌర కాంతులు
కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.in ద్వారా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
● రిజిస్ట్రేషన్, ఆమోదిత విక్రేత ఎంపిక, సోలార్ ప్లాంట్ ఏర్పాటు, తనిఖీ, నెట్ మీటరింగ్, సబ్సిడీ పొందే ప్రక్రియను పథకం మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలి.
● సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే ముందు తమ ఇంటి విద్యుత్ వినియోగం, అవసరమైన ప్లాంట్ సామర్థ్యం, పైకప్పుపై అందుబాటులో ఉన్న స్థలం, మొత్తం వ్యయం, సబ్సిడీ అర్హత వివరాలను పరిశీలించుకోవాలి.
● మార్కెట్‌లో అనేక సోలార్ ప్లేట్ల కంపెనీలు, వెండర్స్ (డిస్ట్రిబ్యూటర్స్) అందుబాటులోకి వచ్చాయి. నచ్చిన కంపెనీని ఎంపిక చేసుకుంటే వారి సిబ్బంది వచ్చి ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాలో రాయితీ సొమ్ము జమవుతుంది.
అచ్చంపేట: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక విద్యుదుత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం.. రోజురోజుకూ వినియోగం అమాంతం పెరగడం.. దీనికితోడు విద్యుత్ బిల్లులు భారం కానున్న నేపథ్యంలో రూఫ్‌టాప్ (గృహాలు, భవనాలపైన) లేదా ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉంటే సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునేలా.. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్– ముఫ్త్ బిజ్లీ యోజన తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా ప్రజలు ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌తో విద్యుత్ బిల్లులకు చెక్ పడనుంది. రూఫ్‌టాప్ సోలార్ వినియోగం ద్వారా సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చు.
రాయితీ వర్తింపు ఇలా..
ఒక కిలో వాట్ సోలార్ ప్లాంట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్స్ అంతకన్నా ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా రూ.78 వేల వరకు సబ్సిడీ వర్తిస్తోంది. రాయితీలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ప్రారంభ వ్యయం తగ్గుతుంది. అర్హత, సాంకేతిక ప్రమాణాలు, పథకం నిబంధనలకు అనుగుణంగా సబ్సిడీ లభిస్తుంది. 3 కిలోవాట్లు రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ రూ.1.80 లక్షల ఖర్చు అవుతుంది. ఇందులో రూ.78 వేల సబ్సిడీ లభించనుంది. అనుకూల పరిస్థితుల్లో నెలకు 360 యూనిట్లకు పైగా విద్యుదుత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వాతావరణ పరిస్థితులు, పైకప్పుపై సూర్యరశ్మి లభ్యత, ప్లాంట్ పనితీరు ఆధారంగా ఉత్పత్తి మారుతుంది. ఇంటి విద్యుత్ వినియోగం సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు అనుగుణంగా ఉంటే విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు.
రుణ సదుపాయం..
ఇంటి పైకప్పులపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సూర్యరశ్మి సహాయంతో విద్యుదుత్పత్తి అవుతుంది. దీనివల్ల గ్రిడ్ నుంచి తీసుకునే విద్యుత్ వినియోగం తగ్గి.. నెలవారీ విద్యుత్ బిల్లుపై గణనీయమైన ఆదా పొందవచ్చు. తద్వారా సోలార్ ప్లాంట్ సామర్థ్యం, ఇంటి విద్యుత్ వినియోగం, సౌర విద్యుదుత్పత్తిని బట్టి విద్యుత్ బిల్లు జీరో అవుతుంది. బ్యాంకులు కూడా అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణం ఇస్తూ.. నెలవారీగా (ఈఎంఐ) చెల్లించే సదుపాయం కూడా కల్పిస్తున్నాయి.
ఇంటిపై సోలార్‌తో
విద్యుత్ బిల్లులకు చెక్
మరోవైపు మిగులు విద్యుత్‌తో
రిటర్న్ ఆదాయం
టీజీఎస్‌పీడీసీఎల్, రెడ్ కో
సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన
జిల్లాలో ముందుకొస్తున్న
గృహ విద్యుత్ వినియోగదారులు
జిల్లాలో పథకం అమలు ఇలా..
త్వరలో ఏర్పాటు చేయనున్న
ఇళ్లు 245
రూ.3.17 లక్షలతో 5 కిలోవాట్ల సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకున్నా. నెలకు 600 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుండగా.. మేము 300 యూనిట్లే వాడుతున్నాం. ప్రతినెలా 300 యూనిట్లు విద్యుత్ శాఖకు విక్రయిస్తున్నాం. యూనిట్‌కు రూ.2.85 చొప్పున ఆరు నెలలకోసారి ఇస్తున్నారు. విద్యుత్ శాఖ ఎలాంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేసిన మిగులు విద్యుత్ డబ్బులు సకాలంలో చెల్లించాలి.
– వనం చందు, అచ్చంపేట
నెలకు రూ.300 యూనిట్ల వరకు వాడే వారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరం. వారికి బిల్లుల భారం గణనీయంగా తగ్గుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అదనంగా కొంత రాయితీని ఇస్తున్నాయి. ఇదే విధంగా తెలంగాణలోనూ ప్రభుత్వం మరికొంత రాయితీ ఇవ్వాలి. దీంతో ఎక్కువ మంది ఈ పథకం వైపు మొగ్గుచూపే అవకాశం ఉంటుంది.
– బైరమోని గౌరీశంకర్, అచ్చంపేట
జిల్లాలో ప్రతినెలా 10 వరకు ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను మంజూరు చేస్తున్నాం. సౌర విద్యుత్‌పై ప్రజల్లో మంచి అవగాహన వచ్చింది. సోలార్ విద్యుత్ వల్ల కరెంటు కోసం విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. దీని వల్ల దేశానికి, పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
– నర్సింహారెడ్డి, ట్రాన్‌కో ఎస్‌ఈ
3 కిలోవాట్లు రూఫ్‌టాప్ సోలార్
ప్లాంట్‌కు అయ్యే ఖర్చు రూ.1.80 లక్షలు
కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.78 వేలు
ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన సోలార్ వ్యవస్థ 1,079


